BHAGAVATA KADHA-3    Chapters   

హస్తినాపురమునకు విదురాగమనము

44

శ్లో || విదురస్తీర్థ యాత్రాయాం మైత్రేయాదాత్మనో గతిమ్‌,

జ్ఞాత్వాగాత్‌ హస్తినాపురం తథావాస్త వినిత్సితః ||

---శ్రీభాగ. 1 స్కం. 13 అ. 1 శ్లో .

"విదురుడు తీర్థయాత్రసని మైత్రేయ ముందటఁ గర్మయోగ జ్ఞానాది విషయంబులయిన ప్రశ్నంబులం గొన్నిటింజేసి యతని వలన నాత్మగతిం దెలిసి కృతార్థుండై హస్తినా పురంబునకు వచ్చిన"

---శ్రీమదాంధ్ర భాగవతము.

ఛ ప్ప య

ఆయే చాచా విదుర, యుధిష్ఠిర సుని హర్షాయే,

కరి స్వాగత సత్కార, ప్రేమతేఁ పురమేఁ లాయే ||

పుని పూఛీ కుశలాత, కృష్ణ కీ కహో కహానీ,

తిరో భావ కూఁ త్యాగి, విదుర నే సభీ బఖానీ ||

స్వయం ధర్మ శత బరష తక్‌, శూద్ర భ##యే మునిశాపసుని,

శూలీ కే కారణ కుపిత, శాప దయో మాండవ్య ముని||

అర్ధము

విదురుఁడు వచ్చిన సంగతి విని యుధిష్ఠిరుఁడు సంతసించి స్వాగత సత్కారములు కావించి భక్తియుక్తముగఁ బురము లోనికిఁ గొనివచ్చి, కుశల ప్రశ్న లడిగి కృష్ణవృత్తాంతమును జెప్పెమనెను. విదురుఁడు శ్రీకృష్ణ నిర్యాణవృత్తాంతము వదలి సర్వవృత్తాంతమును జెప్పెను.

శూలమున గ్రుచ్చఁబడిన మాండవ్య మహాముని కోపించి శపింపఁగా యమధర్మరాజు శూద్రుఁడై పుట్టి స్వయముగ ధర్మముగ నడచుచు నూఱు సంవత్సరములు జీవించెను.

-----

దుఃఖములలో మన దగ్గఱ నున్నావారును, విపత్కాలమున మనలను రక్షించినవారు నగు బంధువులు సుఖసమయమున మన దగ్గఱ నున్నప్పటికిని వారిని మనము ప్రాణములకంటె నెక్కుడుగఁ బ్రేమించుచుందుము. దుఃఖము స్నేహమును ఉజ్జ్వలముగను, దీక్షణముగను బ్రకాశింపఁ జేయును. బాల్యమునఁ గౌరవులు పాండవుల ననేక విధముల బాధించిరి. వాటినుండి పాండవులను విదురుఁడు రక్షించుచు నప్పుడప్పుడు సమయోచిత సలహా నొసంగి తగిన సహాయము చేయుచుండెడువాఁడు. ఇప్పుడు ధర్మరాజు రాజయ్యెను. ఇప్పుడు విదురున కేమి సహాయము లభించెనో తెలిసికొమనలయునని శౌనకుఁడిట్లడిగెను :- " సూతా ! నీవతి సంక్షేపముగ మహాభారత కథను జెప్పితివి. అశ్వర్థామవలన విడువఁ బడిన బ్రహ్మాస్త్రముచేఁ జావకుండఁ బరీక్షిత్తును గాపాడిన సంగతియుఁ జెప్పితివి. పరీక్షిన్మహారాజు జననము, శ్రీకృష్ణ ద్వారకాగమనము, అశ్వమేథ యజ్ఞముకొఱకు మరల హస్తినాపురమునకు వచ్చుటయు, నశ్వమేధయాగము సాంగోపాగముగఁ బూర్తియగుటయు మొదలగు విషయములన్నియు నీవతి సంక్షేపముగ గొప్ప మెలకువతోఁ జెప్పితి. మేమిప్పుడు విదురుని సంగతి యే మైనదో, ధృతరాష్ట్రుఁడు హస్తినాపురమున నెంతవఱకుండెనో, పాండవులు పరీక్షిత్తునకు రాజ్యము నెప్పుడు, ఏల వప్పగించిరో, చివరకు పాండవులు శరీరము నెట్లు వదలిరో, ఈ సంగతులన్నియుఁ జెప్పి, ఆతరువాత పరీక్షిన్మహారాజెట్లు రాజ్యపాలనము కావించెనో, పరోపకార మయమగు శరీరము నాతఁడెట్లు గంగాతీరమునఁ ద్యాగము కావించెనో చెప్పవలయును".

శౌనకుని ప్రశ్నను విని సూతుఁడు మిక్కలి సంతోషమును జెంది యిట్లనెను :- " మహాభాగా ! నీవు గొప్ప పుణ్య మయమగు ప్రశ్న మడిగితివి. నీ ప్రశ్నలకు జవాబొసంగు సందర్భమున నాకు పరాత్పరుఁడగు వాసుదేవుని కమనీయ కథలను జెప్పు భాగ్యముకూడ లభించినది. నీసంప్రశ్నము కారణంబుగ జగన్నాథుని చరిత్రను స్మరించుట సంభవించినది. మంచిది యిఁక మీరు సంక్షేపముగ విదురవృత్తాంతమును వినుఁడు."

దుష్ట దుర్యోధనుని దుర్వ్యవహారమునకు దుఃఖితుఁడై బుద్ధిమంతుఁడగు విదురుఁడు భారతయుద్ధమునకుఁ బూర్వమే తన ధనస్సును గౌరవసభా ద్వారమున నుంచి యుదాసీనుఁడై తీర్థయాత్రార్థమై వెళ్లి పోయెను. ఆతఁడు మహాత్ముఁడగుటచే నాతని కేమియు మోహమాయ లేదు. ఆతఁడు మరల హస్తినాపురముకు రాఁదలఁపు లేదు. కాని తనకంటెఁ బెద్దవాఁడును, బుట్టంధుఁడు నగు ధృతరాష్ట్రుని మేలుకోరి యాతఁడు మరల హస్తినాపురమునకుఁ దిరిగి వచ్చెను.యాత్రాసందర్భమున నాతఁడు వ్రజములో నుద్ధవుని గలిసికొని, ఆతనిద్వారా శ్రీకృష్ణనిర్యాణ వృత్తాంతమును విని ఆతనివలన మైత్రైయమహాముని సమాచారమును దెలిసికొని, హరిద్వారమునకుఁబోయి, యచ్చట మైత్రేయుని వలన సమస్త సందేహ నివృత్తి కావించుకొని హస్తినా పురమునకు వచ్చెను.

శౌనకుఁడిట్లడిగెను :- " సూతా ! విదురునకు ఉద్దవుఁ డెట్లు తటస్థపడెనో , మైత్రేయుని విదురుఁడేమని ప్రశ్నించెనో మాకుఁ జెప్పదగియుండిన విపులముగాఁ జెప్పుఁడు."

సూతుఁ డిట్లు చెప్పెను :- ''మునులారా! నేనీ కథలను బ్రసంగానుసారముగ ముందుముందు స్వయముగఁజెప్పఁ గలను. మీరిప్పుడు సంక్షేపముగ విదుచరిత్రమును, మీఁదట నాతఁడు హస్తినాపురమున నుండి యేమి చేసినదియుఁ జెప్పెదను వినుఁడు.''

శౌనకుడు తొందరతో నిట్లనెను :- " మంచిది. నీ కెట్లు సమంజసమని తోచిన నట్లు చెప్పుడు. దీనిలో భగవత్కాథా వర్ణనము విస్తారముగ నుండునని యిట్లు ప్రశ్నించితిమి. ఇప్పుడు నీవు విదుర వృత్తాంతమునే చెప్పుము."

శౌనకుని సమ్మతిని సూతుఁ డిట్లు చెప్పఁదొడఁగెను :- " ఉద్ధవుని ఆదేశానుసారముగ విదురుఁడు హరిద్వారమునకుఁ బోయి, అచ్చట ఏకాంతమున శాంతముగఁ గూర్చుండిన మైత్రేయ మహామునికిఁ జాల ప్రశ్నలు వేసెను. వేదవేత్తయు విద్వాంసుఁడు నగు మైత్రేయుఁడు కొన్నిటికి సదుత్తరము లొసంగెను. దానికి విదురుఁడు చాల సంతృప్తిజెంది మిగిలిన ప్రశ్నలడుగఁ దలఁపలేదు. మధ్యలోనే సంతోషమును జెందిమునికి ప్రణమిల్లి హస్తినాపురమునకువచ్చెను. "

ఆతఁడు నగరసమీపమునకు రాఁగానే యెవరో చూచి యీ శుభవార్తను ధర్మరాజు కెఱింఁగించిరి. ఈ శుభవార్తను వినునప్పటికి ధర్మరాజు సంతోషమునకు మేఱలేకుండెను. ఆతఁడు భక్తిభావ పరవశుఁడయ్యెను. ఆహా ! తన బిడ్డలవలె మమ్ములను రక్షించిన ప్రాణాధికుఁడగు మాపితృవ్యుఁడు నేఁడు వచ్చి నాఁడను సంగతి తెలిసికొని హర్షో ద్రేకముచే నాతని రోమములు నిక్కబొడిచెను.

ధర్మరాజిట్లా జ్ఞాపించెను :- శ్రీఘ్రముగ సమస్త వాహనములు సిద్ధము కావింపుఁడు పెద్దలు, చిన్నలు, నగరవాసులందఱు మాపినతండ్రికి స్వాగతమీయ నేగవలయును. ఆతఁడు మాకు దైవసమానుఁడు ఆతని కందఱును హార్దిక స్వాగతమీయవలయును.

ధర్మరాజు ఆజ్ఞకాఁగానే నగరమంతటను ఆనందకోలాహల ప్రవాహ ముప్పొంగెను. నగరమంతట స్త్రీ పురుషులందఱు స్వాగతమున కేర్పాట్లు చేయమొదలిడిరి. సేవకులు శీఘ్రముగఁ బరువిడి వీధులందును, గృహద్వారములముందును, ముఖ్యముఖ్య ద్వారములందును , చౌకులందును పతాకాదులచేతను, దోరణములచేతను అలంకరించిరి. పెద్దలు, చిన్నలు, బాలురు, వృద్ధులు, స్త్రీలు వారివారి రథవాహనములపై నెక్కి నగరము వెలుపలకు విదురునకు స్వాగతమీయ వెడలిరి. చాలామంది కాలినడకనే పరువిడుచుండిరి. దూరమునుండి తపస్వివలె జడలుధరించి, వల్కల వస్త్రమును గట్టుకొని కాలినడకతో విదురుఁడువచ్చుట నందఱును గాంచిరి. అందఱును దమతమ వాహనములు డిగ్గి మిక్కలి వేగమున ఁ బరువిడియాతని గౌఁగిలించుకొని విలపింప మొదలిడిరి. ఆ సమయమున ఁ ధృతరాష్ట్రుడు కూడతన తమ్మునకు స్వాగతమిచ్చుటకు రథము డిగ్గి వచ్చుచుండెను. యుయుత్సుఁడు, సంజయుఁడు, కృపాచార్యుఁడు, ఇతర పాండవులు, బంధువులు చుట్టుకొని నిలుచుండిరి. విదురుఁడు మరల తిరిగివచ్చునను నాశ##యెవ్వరికిని లేదు; కాని హఠాత్తుగా నాతఁడువచ్చుట చూడఁగానే అందఱకును విపరీతమగు నానందము కలిగెను. అందఱకుఁబోఁగొట్టుకొనిన విలువగల వస్తువు దొరికిన నెట్లుండునోఅట్టి యానందము కలిగెను. ఎన్నటికిని నయము కాదనుకొనిన మొండిరోగము దాని కదియే నయమైన నెట్లుండునో అట్లుండెను. గ్రుడ్డివానికి దృష్టి వచ్చినట్లును, చచ్చిన వానికి మరల ప్రాణము వచ్చినట్లుండెను. అందఱును లజ్జా, ప్రేమ, నమ్రతలతో విదురు నాలింగనాదులు చేసికొనిరి. అందఱును బ్రేమాశ్రువులను గార్చిరి. అందఱు తదేక దృష్టితోఁ దపస్సుచేఁగృశిచిన విదురుని జూడమొదలిడిరి. విదురుఁడందఱకు యథోచిత సత్కారము కావించి, పరస్పర కుశలప్రశ్నానంతరము రాజభవనమునకు ఁ బోయిరి.

రాజభవనమునకుఁ జేరఁగానే ధర్మరాజాతనిని ఉత్తమాననమునఁ గూర్చుండఁ బెట్టి యథోచిత పూజలు కావించెను. పాండవ కులములోఁగల చిన్న పెద్ద స్త్రీలందఱు అనఁగా ఁగుంతి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, పాండవ కౌరవుల కులములోని యితర కోడండ్రు వచ్చి తపస్వియగు విదురుని దర్శించిరి. విదురుఁడు సందర్భానుసారముగ నెవరి నెట్లు కుశల ప్రశ్న చేయవలయునో అట్లు కుశలప్రశ్న కావించిరి. కుంతి ఎండి వాడిన విదురుని శరీరమునఁ జేత నిమురుచు విలపించెను. ఆమె యిట్లనెను :- " ఏమి ! విదురా ! నీవు మమ్ములను మఱచియే పోయితివా ? దుఃఖములో మమ్ములను గనిపెట్టుకొని యుంటివి. సుఖము రాఁగానే మమ్ములను జూడకపోవుటచే వెనుకటికంటె మిక్కిలి దుఃఖములో నుంటిమి. నీవు బోత్తిగా మారిపోయితివి. గుర్తింప వీలులేకున్నది. శరీరమంతయు నెండిపోయినది."

విదురుఁడు తన కన్నీటిని దుడుచుకొనుచు నిట్లనెను :- " వదినా! ఎవరి ననఁగలము? అంతయు వారివారి యదృష్టమును బట్టియుండును. మానవుఁడు ప్రారబ్ధసూత్రమున బంధింపఁబడినాఁడు. ప్రారబ్ధ మెచ్చటకు లాగుకొనిపోయిన నచ్చటకు తన కిష్టములేకున్నను జీవి వెళ్లితీరవలసినదే."

విదురుని వాక్యములను విని ప్రేమాశ్రువులను రాల్చుచు ధర్మరాజిట్లనెను :- " బాబాయీ ! మీకు మేమెప్పుడైన జ్ఞాపకమునకు వత్తుమా ? నిజము పలుకుఁడు . పక్షి తన గ్రుడ్లను దన ఱక్కల క్రిందఁబెట్టుకొని పొదిగి కాపాడినట్లు మీరునుమ్ములను రక్షించుచుంటిరి. తోటమాలి తన మొక్కల క్షేమమునే సదా చింతించునట్లును, రైతు క్షేత్రములోని యంకురములను గూర్చి యే చింతించునట్లును, లేకలేక కనిన తల్లి తన ఏకైక పుత్రుని యెడల కన్నులు పెట్టుకొని చూచునట్లును, మమ్ములను మీరు సర్వదా రక్షించుటలో సావధానులైర యుంటిరి. మీ కృపవలననే మేమిత పెరిగి పెద్దవారమైతిమి. మీ కృపవలననే శత్రుక్షయము కావించి చతుస్సముద్ర వలయిత సమస్త భూమండలమునకుఁ జక్రవర్తినైతిని. దుర్యోధనుఁడు భీమునకు విషమీయనున్నాఁడని చెప్పినది మీరే. కౌరవులు వారణావతములోఁ దల్లితోఁగూడ కాల్చి చంపఁ బ్రయత్నించి మాకొఱకై లక్కయిల్లు కట్టింపఁగా నీవు దానిగుండా సొరంగమును ద్రవ్వించి, పడవవానిని, పడవను సిద్ధముగ, బంపి మమ్ములను రక్షించితిరి. మీరు మా యెడల దయతలఁపకుండిన మేమచ్చట మసియయ్యెడు వారమే. ఇట్టి మీరు మమ్ములను వదలి వెళ్లి పోయితిరి."

విదురుఁడిట్లనెను :- " ధర్మరాజా ! ఎవరు ఎవరిని రక్షింపఁ గలుగుదురు ? దేవ పుత్రులగు మిమ్ములను రక్షించుశక్తి నా కెక్కడిది ? మిమ్ములను మీధర్మము, మీ సత్యము, మీసదా చారమే రక్షించినది. ధర్మము నెవరు రక్షింతురో వారిని వారి ధర్మమే రక్షించును. భగవంతుని దగ్గఱ ఆలస్యమైనప్పటికి అంధకారముండఁజాలదు. దుర్యోధనుఁడు నన్ననేక కువాక్యములు పలికినాఁడు. వాటిని వినినవాఁడు మరల నాతని రాజ్యమున నుండఁజాలడు. నేను మీ పక్షము నుండనికారణము - లోక నిందకు భయపడియే. అదియునుగాకత నే నీయసహ్య బంధువధను జూడఁజాలకయే పుణ్యతీర్థ యాత్రకు వెడలితిని. ఈ మూలమున నాకు పుణ్యము లభించినది. యుద్ధము చూడనవసరము లేకుండ, విననవసరము లేకుండఁ బోయినది."

ధర్మరాజిట్లనెను :- " మీయాత్రలో నెట్లు గడపితిరి ? మీకెట్లు గడచినది ? మీరేదైన వాహనము మీఁద వెళ్లితిరా లేక కాలినడకనా ? ఒక్కరే ఉంటిరా లేక యాత్రీకులతో ఁగలిసి యుంటిరా ? మాకీ విషయము లన్నియు వివరముగఁ జెప్పవలయును. మీ యీ విచిత్ర వేషమును జూచిన నాకు మిక్కిలి కుతూహలముగ నున్నది."

విదురుఁడిట్లనెను :- " రాజా ! నేనిక్కడనుండి బయలు దేరినప్పుడు నే నవధూత వేషమును వేసికొంటిని. వస్త్రముల నన్నిటిని తీసి వాఱవేసితిని. కౌపీనమును ధరించితిని. ఒక బొంతను దరించితిని. నన్నెవరును గుర్తింపకుండుటకై యొడలు నిండ బూడిద పూసికొంటిని. నే నొంటరిగాఁ దిరుగాడుచుంటిని. యాదృచ్ఛకముగ నేది లభించిన దానిని దిని సంతుష్టుని జెందెడు వాఁడను. భూమిమీఁదఁ బరుంటిని. కాలినడకను బుణ్యతీర్థణులను, బర్వతములను, నదీనదములను, దేవతాయతనములను, మందిరములను జూచుటకుఁ బర్యటించితిని. ఈ విధముగ నేను భారతవర్షములోని సమస్త ప్రసిద్ధములగు తీర్థయాజ్ఞలను జేసితిని."

ధర్మరాజిట్లడిగెను :- " బాబాయి ! మీ రేయేతీర్థములకు వెళ్లితిరి ?"

విదురుఁడిట్లనెను :- " నేను కురుక్షేత్రము, ఇంద్రప్రస్థము, మథురాపురి, బృందావనము, శూకరక్షేత్రము, వటేశ్వరము, నైమిశారణ్యము, ప్రయాగ, అయోధ్య, చిత్రకూటము, కాశి, గయ, జగన్నాథపురి, వేంకటాచలము, కాంచీ, శ్రీరంగము, చిదంబరము, కుంభకోణము, శ్రీరామేశ్వరము, పండరపురము, ద్వారకా, ప్రభాసక్షేత్రము............"

మధ్యలోనే ధర్మరాజిట్లడిగెను :- " మీరు ద్వారకాపురి, ప్రభాసక్షేత్రమునకుఁగూడ వెళ్లియుంటిరా ? అక్కడ మీరు యాదవుల నందఱను గలిసికొనియుండవచ్చును. భగవానుని దర్శనముకూడ అయియుండవచ్చును. అర్జునుఁడక్కడేఉన్నాడు. ఆతనిని గూడ కలిసికొని యుండవచ్చును. మీరు నాకు శ్రీకృష్ణుని వృత్తాంతమంతయుఁ జెప్పవలయును."

విదురుఁడు ప్రభాసక్షేత్రము నుండియే అత్యంత శ్రీఘ్రముగ యోగమార్గమున మథురాపురి, హరిద్వారము మీఁదుగా నిచ్చటికి వచ్చి యుండెను. యదువంశమ క్షయమైన వృత్తాంతము నాతఁడు ఉద్ధవుని వలన వ్రజములో వినియుండెను. వాసుదేవుఁడు దేవతా ప్రార్థనచే స్వధామమునకుఁ జేరెను. కాని విదురుఁడు ఈ దుఃఖిసమాచారమును దాను స్వయముగఁ జెప్పఁదలఁప లేదు. కారణ మాతఁడు స్వాభావికముగ దయాళువు. ఆతఁ డెల్లప్పుడును బాండవులను సంతోషపెట్టుట కార్యములనే చేయుచుండును. దీనికొఱకే ఆతఁ డెల్లప్పుడును బ్రయత్నించుచుండును. అట్టియెడ నిప్పుడాతఁ డీదుఃఖ వృత్తాంతమును జెప్పివారికి బాధ యేల కలిగించును ? ఆతఁ డిట్లనుకొనెను :- " ఎప్పుడో ఒకప్పు డీసమాచారమును ధర్మరాజు వినఁగలఁడు. అర్జునుఁడు స్వయముగ వచ్చి చెప్పఁగలఁడు. అట్టి యెడ నేను సంతసమును జింతగ నేల మార్చవలయును ? " అని తలఁచి యాతఁడు యాత్రా వృత్తాంతము నంతను జెప్పెనుగాని యందుకులక్షయ వృత్తాంతమును మాత్రము చెప్పలేదు. ఆతఁడిట్లనెను :- నాయనా ! నేను బంధువులకడ కెక్కడికిని వెళ్లలేదు నా ప్రయోజనము తీర్థయాత్ర చేయుటయే. "

ధర్మరాజిట్లనెను:- " మీకు తీర్థయాత్రలచే నేమి పుణ్యము కలుగును ? మీరు స్వయముగఁ దీర్థస్వరూపులరు. నిజమే, తీర్థముల వలన మీకు లాభము కలుగఁ గలదు. తీర్థములలో ఁ బావులు స్నానముచేసి వాటిని ఁగల్మషము కావింతురు. సదా శ్రీహరి నివసించు హృదయముగల మీబోటి పరమ భాగవతోత్తములు వానిలో స్నానము కావించి యాతీర్థణుల పాపములను బోఁగొట్టుచుందురు. మీరు స్వయముగఁ దీర్థయాత్రలు చేయబోఁలేదు; కాని తీర్థములను యథార్థ తీర్థము లుగఁజేయుటకు భూమిమీఁదఁ జరించుచుందురు. మీవంటి పరోపకారులగు భగవద్భక్తుల స్వభావ మిట్లేయుండును.

ఈవిధముగఁ బరస్పర కుశలప్రశ్నలు శిష్టాచార విషయ ప్రసంగము జరిగిన తర్‌%ోవాత యుధిష్ఠిరుఁడు విదురుఁడుండుటకు మణిమయ భవనము నిచ్చెను. ఆతని యుపయోగముకొఱకు సమస్త దివ్య వస్తువుల నొసంగెను. స్వర్గములో దేవతలు సుఖముగనున్నట్లు విదురుఁడుండెను. ఆతనికి సాంసారిక సుఖస్పృహ లేదు. భోగవాంఛలేదు. కాని యాతఁడు పాండవుల సంతోషము కొఱకును, తన యన్నయగు ధృతరాష్ట్రునకు మేలు చేయఁ గోరిక తోడను గొంతకాలము ధర్మరాజుదగ్గఱ దివ్య రాజభోగము లనుభవించుచు నుండెను. సాక్షాత్తుగాఁ బ్రాణులను దండించు యమధర్మరాజే ముని శాపవశమున విదురుఁడయ్యెను. ఇట్టి బుద్ధి మంతుఁడగు విదురుడు లభింప ధర్మరాజు ఆనందమునకు మేఱ లేకుండెను. ఆతఁడు తన సమస్త రాజ కార్యములందును విదురుని సలహాను గొనుచుండెను. ఆయన నడిగియే సమస్త కార్యములు చేయుచుండెను.

ఛప్పయ

విదుర దేవవత లఖే అంగ పాండవ న సమాయే |

మనోఁమృతక శరీర ప్రాణ ఫిరతేఁఫిరి ఆయే ||

పూఛేఁ పాండవ చచా| హమేఁచ్యౌఁఅస బిసరాయే |

కుంతీ బోలీఁ, లలా! భూలి తుమ ఇత కిత ఆయే ?

ప్రణయ కోపయుత మధుర అతి, నునత విదుర బోలే బచన |

భాభీ! భాగ్య అధానహైఁ, సుఖదుఃఖ అరు విబురన మిలన ||

అర్థము

దైవసమానుఁడు విదురుని గాంచి పాండవులు ఆనంద మును బట్టలేకపోయిరి. వారకి చచ్చనివానికి ప్రాణము వచ్చిన నెట్లుండునో అట్లుండెను. అప్పుడు పాండవు ఇట్లనిరి:-

''బాబాయీ! మీరు మమ్ములను వదలి పోయితిరా?'' ''మాఆఁది! దరాతప్ప నీవీవైపునకు వచ్చినట్లున్నా''వని ప్రణయకోపమున నతి మధురముగఁ బలుకకు కుంతీదేవి వాక్యములను విని విదురుఁడు ''వదినగారూ! సుఖదుఃఖములు కానిండు, సంయోగ విమోగములు కానిండు ఇవన్నియు దైవాధీనములు.''

BHAGAVATA KADHA-3    Chapters